Hyderabad | వెంగళరావునగర్, మే 3: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నానంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు.. భార్యను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న ఉదంతం హైదరాబాద్ మధురానగర్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు యువతి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందిన వైద్యురాలైన యువతి (25)ని ఏడాదిన్నర క్రితం ఎల్లారెడ్డిగూడ ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉండే యువకుడికి ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు.
తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానంటూ పెళ్లికి ముందు యువకుడు నమ్మబలికాడు. పళ్ళున కొన్నాళ్లకు భర్తకు ఉద్యోగం లేదని తెలిసినా సదరు యువతి సర్దుకుపోయింది. వీరికి ఓ పాప పుట్టింది. అడపిల్లను కన్నావంటూ ఆ యువతిని భర్త చిత్రహింసలకు గురిచేశాడు. క్రమంగా భర్తలోని శాడిస్టు బయటకొచ్చాడు. భార్య బాత్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీశాడు. ఆ వీడియోలను అతడి తండ్రికి కూడా చూపించేవాడు.
కొడుకు అండ చూసుకుని ఆ తండ్రి కూడా యువతిపై పలుసార్లు లైంగిక దా డికి యత్నించాడు. మళ్లీ శనివారం తన తండ్రి గదిలోకి భార్యను పంపగా, అఘాయిత్యానికి యత్నించిన మామతో తీవ్రంగా ప్రతిఘటించిన ఆ యువతి అక్కడి నుంచి పరారై పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువకుడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదని, పోర్న్సైట్లలో యువతుల వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు అప్లోడ్ చేయడమే అతడి పని అని ఫిర్యాదులో పేర్కొంది.