సుల్తాన్ బజార్, జూలై 1 : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సుమోటోగా స్వీకరించింది. సిగాచి కంపెనీలో జరిగిన భారీ పేలుడు, అగ్ని ప్రమాదంలో సుమారు 51 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా కార్మికులు గాయపడ్డారని, వారిలో చాలామంది వలస కార్మికులు అని తెలుస్తున్నదని కమిషన్ వివరించింది.
భద్రతా లోపాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘనలపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెల 30లోపు సంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్, సంగారెడ్డి ఎస్పీలకు నోటీసులు జారీ చేస్తూ వివరణాత్మక నివేదికలు ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.