వేములవాడ: వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారి దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
భద్రాచలం: భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో మూడో రోజైన సోమవారం ముత్తంగి అలంకారంలో సీతారాముల వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణ ఆలయంలో రామయ్యకు వేదపండితులు రాపత్తు ఉత్సవం నిర్వహించారు. కాగా, ఆదివారం సెలవు కావడంతో భద్రాద్రికి భక్తులు తరలివచ్చారు. 17,500 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.