భద్రాద్రి -కొత్తగూడెం : శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్యస్పందన (Response) వస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్లు అవుతున్నాయి.
శ్రీరామ నవమి(Srirama Navami) సందర్భంగా భద్రాద్రి(Bhadradri District) శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల(Kalyana Talambralu)ను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే కల్యాణ అనంతరం తలంబ్రాలను భక్తులకు హోండెలివరీ(Home Delivery) చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్ జరుగుతోంది.
భక్తులకు మరో అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది. కార్గో పార్శిల్(Cargo parcell) సెంటర్కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది.