నిరుద్యోగులపై నిర్బంధకాండ.. పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని దిల్సుఖ్నగర్లో భారీ ర్యాలీ
పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చైతన్యపురిలో నిరుద్యోగులు మంగళవారం చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగాలు ఏవంటూ సీఎం రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాలను నినదిస్తూ నిరుద్యోగులు చైతన్యపురి నుంచి దిల్సుఖ్నగర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
- రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు
- రెండు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
- అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్
- జీపుల్లోకి ఎక్కించుకొని నేతలపై పిడిగుద్దులు
- ప్రభుత్వ దమనకాండపై బీఆర్ఎస్ ఆగ్రహం
- లాఠీలు ఝుళిపించడమేనా ప్రజాపాలన?
- అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలి
- 5 వేల పోస్టులతో యువతను మోసం చేయొద్దు
- 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
ఎల్బీనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ ) : పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చైతన్యపురిలో నిరుద్యోగులు మంగళవారం చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగాలు ఏవంటూ సీఎం రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాలను నినదిస్తూ నిరుద్యోగులు చైతన్యపురి నుంచి దిల్సుఖ్నగర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ప్రాంతమంతా నిరుద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని నిరుద్యోగులు పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా ర్యాలీని అడ్డుకున్నారు. నిరుద్యోగులను పోలీస్స్టేషన్లకు తరలించేందుకు యత్నించిన సమయంలో పోలీసులు, నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. నిరుద్యోగులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, భూక్యా కుమార్లను సరూర్నగర్ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనం ఎక్కించారు. జీపులోకి ఎక్కించిన తర్వాత పోలీసులు తమపై పిడిగుద్దులతో దాడి చేశారని బాధితులు వాపోయారు.

భూక్యాకుమార్, ఇంద్రానాయక్పై సరూర్నగర్ పోలీసులు సెక్షన్ 126/2, 291/5 బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. మరికొందరు నిరుద్యోగులను నాగోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరుద్యోగుల నిరసనతో ఎన్హెచ్-65పై రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

