భారీగా పెరిగిన మీసేవ చార్జీలు
రాష్ట్రంలో మీసేవ చార్జీలు భారీగా పెరిగాయి. ఇప్పటికే అన్ని విధాలుగా ధరలు పెంచిన సర్కార్ మీసేవ చార్జీలను సైతం వదలలేదు. ఇక నుంచి మీసేవ చార్జీలను భారీగా పెంచారు. దాదాపు 100 శాతం కంటే ఎక్కువగా చార్జీలు పెంచారు.
- రేషన్‌కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్‌కు రూ.80
- బర్త్ సర్టిఫికెట్ ప్రింట్, ఈసీకి రూ.62
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మీసేవ చార్జీలు భారీగా పెరిగాయి. ఇప్పటికే అన్ని విధాలుగా ధరలు పెంచిన సర్కార్ మీసేవ చార్జీలను సైతం వదలలేదు. ఇక నుంచి మీసేవ చార్జీలను భారీగా పెంచారు. దాదాపు 100 శాతం కంటే ఎక్కువగా చార్జీలు పెంచారు. బీ క్యాటగిరీ పరిధిలోని రేషన్‌కార్డు, ఆదాయం, కులం, రెసిడెన్స్, కొత్త విద్యుత్ కనెక్షన్, భూభారతి కేవైసీ వంటి వాటికి ఒకేసారి రూ.80 పెంచారు. మొత్తం 15 రకాల సర్వీసులకు పెంచిన కొత్త చార్జీలు అమలవుతాయి. అలాగే పుట్టిన సర్టిఫికెట్ ప్రింట్, ఈసీ వంటి సర్వీసులకు రూ.62 పెంచారు.
వీటి పరిధిలోకి మరికొన్ని సర్వీసులను వర్తింపజేస్తున్నారు. ప్రతి పేజీ స్కానింగ్ కోసం రూ.2.50 అదనంగా వసూలు చేయనున్నట్టు తెలిపారు. పెంచిన ఈసేవ కొత్త చార్జీలు ఈ నెల 1 నుంచే (బుధవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. ఇప్పటి వరకు ఈసేవ కనీస చార్జీ రూ.35 వసూలు చేసేవారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరవడానికే చివరాఖరుకు మీసేవ చార్జీల పెంపును కూడా వదిలిపెట్టలేదు అని వినియోగదారులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

