నిజామాబాద్: శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,10,690 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి 99,940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీరు వెళ్తున్నది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ఇప్పుడు 1087.6 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 75.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది.