మెదక్: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్‌లోని (Medak ) ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వనదుర్గా మాత ఆలయం ముందు నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. గర్భగుడిలో అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు.
కాగా, నక్క వాగు వరద మంజీరాలో చేరడంతో వనదుర్గా ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరద నేపథ్యంలో మంజీరాలో జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టువైపు వెళ్లకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
మెదక్ – ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం. వద్ద వరద ఉధృతి pic.twitter.com/LeonFdhPWu
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2024