శాంటియాగో, మార్చి 9: కోట్ల ఏండ్ల క్రితం మన సౌరవ్యవస్థలో నీళ్లు ఎలా ఉద్భవించా యి? అనే మిస్టరీ వీడనున్నది. ఇందుకోసం మన సమీప నక్షత్ర వ్యవస్థ సహాయం చేస్తున్నది. ఈ వ్యవస్థలోని ‘వీ883 ఓరియోనిస్’ అనే కొత్త నక్షత్రం చుట్టూ ఖగోళ పరిశోధకులు నీటి అణువులను గుర్తించారు. పరిశోధకులు ఉత్తర చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్ మిల్లీమీటర్ అరే ఆఫ్ టెలిస్కోప్‌ల శ్రేణిని ఉపయోగించి 1,300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ నక్షత్రాన్ని గమనించారు.
ఈ నక్షత్రం పుట్టినప్పటి నుంచీ దాని చుట్టూ ధూళి, మేఘం, వాయువులతో కూడిన గ్రహం ఏర్పడినట్టు గుర్తించారు. చివరికి మిలియన్ ఏండ్లలో ఈ గ్రహం తోకచుక్కలు, గ్రహశకలాలు, గ్రహాలుగా రూపాంతరం చెందుతుంద ని అంచనా వేశారు. ఈ గ్రహాన్ని ఏర్పరిచిన డిస్క్‌లో రసాయన సంకేతాల ద్వారా నీటి ఆవి రి, గ్యాసియస్ వాటర్ (వాయురూపంలో నీరు ) ఉన్నట్టు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితా లు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.