హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి పాల్పడుతున్నది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కేసీఆర్‌పై తీవ్ర అస్వస్థత ముద్రవేసే పన్నాగానికి తెరతీసింది. నిత్యం పార్టీ శ్రేణులతో భవిష్యత్ కార్యాచరణపై స మాలోచనలు జరుపుతూ, వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ పనులతో బిజీబిజీగా గడుపుతున్న నేతకు అనారోగ్యం అంటూ దుష్ప్రచారానికి దిగింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌కు తీవ్ర ఆస్వస్థత అంటూ ప్రచారం చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా 12 రోజులుగా కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారని, య శోద దవాఖాన బృందం గజ్వేల్‌లో ఎమర్జెన్సీ యూనిట్‌ను నెలకొల్పి 24 గంటలు పర్యవేక్షిస్తున్నదని ప్రచారం చేస్తున్నది.
రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్ కుటుంబ సమేతంగా బుధవారం కేసీఆర్‌ను కలిసి, తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ 12 రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైతే ఇవి సాధ్యపడ్తాయా? అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎస్సీ వర్గీకరణ దోహదం చేస్తుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం స్ఫూర్తివంతమైనదని తెలిపారు. ఆయన పోరాటం ఫలించిందని చెప్పా రు. హైదరాబాద్‌లోని పొన్నాల లక్ష్మయ్య నివాసానికి శుక్రవారం మందకృష్ణ వెళ్లారు. మర్యా ద పూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారు.