House Tax | మంచిర్యాలటౌన్, మార్చి 22: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సున్నంబట్టి వాడలలో ఇంటి పన్ను చెల్లించని లేదని కార్పొరేషన్ అధికారులు ఓ ఇంటికి తాళం వేశారు. ఆస్తిపన్ను ఐదేండ్లుగా చెల్లించడం లేదని అధికారులు ఆ ఇంటి యజమాని స్వామికి తెలుపగా ఆయన స్పందించలేదు.
గడువు పూర్తికావడంతో రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఇంటికి వెళ్లి తాళంవేశారు. విషయం తెలుసుకున్న ఇంటి యజమాని గంటలోపే చెల్లించాల్సిన మొ త్తం పన్ను రూ.31వేలు చెల్లించాడు. అలాగే పట్టణంలోని బైపాస్‌రోడ్డులో షౌకత్ బేగంకు చెందిన వెల్డింగ్దుకాణానికి సంబంధించిన ఆస్తిపన్ను రూ. 24వేలు మూడేళ్లుగా కట్టక పోవడంతో దుకాణానికి తాళం వేశారు.