సంగారెడ్డి : గురుకుల పాఠశాలలో విద్యార్థులను తల్లీతండ్రీ అన్నీ తానై చూసుకోవాల్సిన హాస్టల్ వార్డెన్ ఒక వీధి రౌడీలా ప్రవర్తించారు. హాస్టల్లో వసతులు సరిగా లేవని విద్యార్థులు రోడ్డెక్కడంతో అతను ఆగ్రహం వ్యక్తంచేశాడు. వంటమనిషికి ఫోన్‌చేసి విద్యార్థులను దూషించాడు. అంతేగాక ‘అందరికీ విషంపెట్టి చంపెయ్ పీడ పోతది’ అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా గడిచిన 10 రోజులుగా హాస్టల్లో కరెంట్ లేదని, వార్డెన్‌ను అడిగితే తాగివచ్చి బూతులు తిడుతున్నాడని విద్యార్థులు ఇటీవల రోడ్డుపై బైఠాయించారు. దాంతో తనపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ కోపంతో పిల్లలను బూతులు తిట్టాడు.
‘అందరికీ విషం పెట్టి చంపేయ్ పీడ పోతది’ అంటూ వంట మనిషికి ఫోన్‌చేసి చెప్పాడు. అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్ వెంటనే వార్డెన్ కిషన్ నాయక్‌ను విధుల నుంచి తొలగించారు.
నా మీదనే ఫిర్యాదు చేస్తారా విషం పెట్టి చంపేయ్ అందరిని..!!
ఎస్సీ గురుకుల విద్యార్థులకు విషం పెట్టి చంపేయమని వంట మనిషికి వార్డెన్ ఆదేశాలు
ఇటీవల 10 రోజులుగా స్కూల్లో కరెంట్ లేదని, వార్డెన్ తాగి వచ్చి బూతులు తిడుతున్నాడని రోడ్డుపై బైఠాయించిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ… pic.twitter.com/YQpfaYUA8i
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026