Horticulture Officer | హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 17న నియామక పరీక్ష జరునుండగా.. అభ్యర్థులు ఆదివారం (జూన్ 11) సాయంత్రం 5 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ప్రాక్టీస్ కోసం వెబ్సైట్లో మాక్ టెస్టు రాయాలని కోరింది. ఇదిలా ఉండగా.. డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ పరిధిలోని హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టుల నియామక పరీక్ష వాస్తవానికి ఏప్రిల్ 1న జరుగాల్సి ఉంది. ఈ ఎగ్జామ్స్‌ను ఈ నెల 17వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనున్నది. 22 మంది హార్టికల్చర్ ఆఫీసర్ల నియామకం కోసం టీఎస్పీఎస్సీ గతేడాది డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జనవరి 3 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.