హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఉద్యోగాల నియామకాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో 4శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నదని, ఈ విషయంలో అపోహలు వద్ద ని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నా రు. శుక్రవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లపై నిరాధారమైన, దుష్ప్రచార వార్తలను సహించబోమని హెచ్చరించారు.
4శాతం రిజర్వేషన్లకు బదులు, 3 శాతం రిజర్వేషన్లే ప్రభుత్వం కల్పిస్తున్నదనే ప్రచారాన్ని ఖండించారు. రాష్ట్రంలో జనాభాపరంగా 12 శాతం ఉన్న ముస్లిం మైనార్టీలకు ఆ మేరకు రిజర్వేషన్లు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహమూద్ అలీ తెలిపారు.