హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ‘గన్మెన్ చెంపదెబ్బ వివాదం’పై ఆయన.. అది అనుకోకుండా జరిగిన పరిణామమని, దానికి తాను తీవ్రంగా చింతిస్తున్నానని, క్షమాపణ కోరారు. తనకు రక్షణగా ఉన్నవారిని సొంతబిడ్డల్లా చూసుకుంటున్నానని తెలిపారు. చెంపదెబ్బ ఘటనపై హోం మంత్రి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.