హైదరాబాద్, మే 24 (నమస్తే తెల ంగాణ): ఇరాక్ పర్యటనలో ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం ఆ దేశ రాజధాని బాగ్దాద్‌లో భా రత రాయబారి ప్రశాంత్ పీస్తో భేటీ అయ్యారు. తెలంగాణ, ఇరాక్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. సాంసృతిక మార్పిడి, వాణిజ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని పెంచే అంశాలపై మాట్లాడారు. ఇరుపక్షాలు తమ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంచడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. భాగస్వామ్య లక్ష్యాలను సాధించడానికి సహకార మార్గాలపై చర్చించారు. హోంమంత్రికి ప్రశాంత్ పీస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇరాక్ పర్యటన సందర్భంగా తనకు లభించిన ఆతిథ్యానికి హోంమంత్రి ఇరాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.