పెద్దపల్లి : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో శాంతిభద్రతలు, నక్సలిజం పెరుగుతుందనే అనేక అపోహలున్నాయని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖ పటాపంచలు దేశంలోనే అత్యుత్తమ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రామగుండం నియోజకవర్గంలో రూ.8.40కోట్లతో నిర్మించిన నూతన పోలీస్ అతిధి గృహం, పోలీస్ స్టేషన్ భవనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రశాంత వాతావరణం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ బలంగా విశ్వసించారన్నారు.
ఈ మేరకు రూ.700కోట్లు ఖర్చు చేసి పోలీసులకు అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు అందించడంతో పాటు డయల్ 100 సేవలను పటిష్టం చేశారన్నారు. ఫ్రెండ్లీ పోలీలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించారన్నారు. పోలీస్ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి.. ప్రతి స్టేషన్లో మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షీ టీమ్స్ అద్భుతమైన విజయాలను సాధించి.. దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని, రాజకీయ జోక్యాన్ని తగ్గించినట్లు పేర్కొంది.
పోలీస్‌శాఖ అమలు చేస్తున్న నూతన విధానాలతో రాష్ట్రవ్యాప్తంగా గత ఎనిమిదేళ్లలో క్రైమ్‌రేటు తగ్గిపోయిందన్నారు. దేశంలో సురక్షితమైన మహా నగరంగా హైదరాబాద్ నిలిచిందని అన్నారు. ఆధునిక నేరాలను అరికట్టేందుకు అవసరమైన పరిజ్ఞానం, వసతులు పోలీస్ శాఖకు అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న సీసీకెమెరాల్లో 64శాతం తెలంగాణలోనే ఏర్పాటు చేసి.. పటిష్ట నిఘా పెట్టినట్లు తెలిపారు.
రామగుండం ప్రాంతంలో మహిళా పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గోదావరిఖని పట్టణంలో ప్రారంభించిన భవనాలను ప్రజలకు మరింత విస్తృతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఎంపీ వెంకటనేశ్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ రూపేశ్, మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.