చొప్పదండి, సెప్టెంబర్ 15 : ఆర్థిక పరిస్థితులు బాగాలేక కరీంనగర్ జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్‌కు చెందిన ముద్దసాని కనుకయ్య (46) కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయనకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
కూతురికి నెల క్రితం పెండ్లి చేశాడు. ఈ క్రమంలో అప్పులు కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించే క్రమంలో చనిపోయాడు. కనుకయ్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.