హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లోని విద్యార్థులకు అందించే హోలిస్టిక్ ప్రోగ్రెస్కార్డులు ఇంకా కొన్ని జిల్లాలకు అందలేదని టీచర్లు చెబుతున్నారు. దాదాపు సగం జిల్లాలకు, బడులకు ఇవి అందలేదని అంటున్నారు. ఈ నెల 23తో విద్యాసంవత్సరం ముగియనున్నది. అదే రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి ప్రోగ్రెస్కార్డులు అందజేయాల్సి ఉంది. అధికారులు చొరవ తీసుకుని అందజేయాలని కోరుతున్నారు.
ప్రైవేట్ అధ్యాపకురాలి వైద్యానికి ఆర్థిక సహాయం
హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) : మల్లారెడ్డి విద్యాపీఠ్ టీచర్ రమాదేవి చికిత్సకు టీఎస్టీసీఈఏ రూ.30వేలు ఆర్థిక సహాయం చేసింది. ఆరోగ్య బీమా కల్పించే దాకా ఒత్తిడి తెస్తామని అధ్యక్షుడు సంతోష్ తెలిపారు.