భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం

హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చింది. భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఢిల్లీలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవులు ప్రకటిస్తున్నటుల్ సీఎం తెలిపారు.
ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాల శాఖల అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎస్ సూచించారు. ఇదిలా ఉండగా.. గులాబ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలు రెడ్ అలెర్ట్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

