కరీంనగర్ :హోలీ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని , అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula kamalar)అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ లో నిర్వహించిన హోలీ (Holi )పండుగలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ వేళ కార్యకర్తలతో కలిసి డీజే పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు ఆనందంగా జరుపుకునే పండుగ హోలీ అని అన్నారు. విభేదాలను, రాజకీయాలను పక్కనపెట్టి ఆడుకునే పండుగని అభివర్ణించారు.తెలంగాణలోని ప్రజలందరికీ శుభం కలగాలని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అన్నారు.హోలీ పండుగ వేళ రసాయనిక రంగులు కాకుండా సహజమైన రంగులనే వాడాలన సూచించారు. హోలీ వేడుకల్లో మేయర్, కలెక్టర్, సిపి, అధికారులు , నగరవాసులు ఉత్సహంగా పాల్గొన్నారు.