మొయినాబాద్, జూన్ 26: రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలోని 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూమిని గోశాలకు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. గురువారం ఆ భూముల వద్దకు హెచ్ఎండీఏ అధికారులు రావడంతో భూబాధితులు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నా రు. దీంతో రైతులు చించల్పేట్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇంటి వద్ద ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే కలెక్టర్కు ఫోన్ చేశారు.
బాధితులకు న్యాయం చేసేవరకు ఎవరూ వెళ్లవద్దని ఎమ్మెల్యే ఆదేశించగా.. ప్ర భుత్వ ఆదేశాలున్నాయని, భూములను తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తేల్చిచెప్పారు.