హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(హిథమ్) ఇంటిగ్రేటెడ్ ట్విన్నింగ్ కోర్సును ప్రవేశపెట్టింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా, జార్జ్ మాసన్ యూనివర్సిటీతో కలిసి కోర్సులు నిర్వహించనున్నది.
గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో కోర్సుల వివరాలను మీడియాకు వెల్లడించారు. జేఎన్టీయూలో బీటెక్, అమెరికాలోని వర్సిటీల నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందవచ్చు.