ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం
ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలు పడుతున్నరు.
- సమ్మె ఎఫెక్ట్ లేదని ఆపసోపాలు
- నైపుణ్యంలేనివారి చేతికి బస్సులు
- లారీని ఢీ కొట్టిన అద్దె బస్సు డ్రైవర్
- డ్రైవర్‌తోపాటు 38 మందికి గాయాలు
- కరీంనగర్ జిల్లాలో ఘటన
కరీంనగర్ విద్యానగర్/తెలంగాణ చౌక్/కొత్తపల్లి : ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలు పడుతున్నరు. కండక్టర్ లేకుండా కేవలం డ్రైవర్‌తో అద్దె బస్సు నడిపేందుకు యత్నిస్తున్నారు. నైపుణ్యంలేని డైవర్ల చేతికి బస్సులు ఇవ్వడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గమ్యానికి చేరుతున్నారు. బుధవారం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా.. కరీంనగర్ అధికారులు మాత్రం పట్టుదలకు పోయి టిమ్ ఆపరేటింగ్ రాని అద్దె బస్సు డ్రైవర్‌ను వరంగల్‌కు పంపించారు.
కరీనంగర్‌లోని రాంపూర్ బైపాస్ వద్ద డ్రైవర్ శ్రీధర్ బస్సు నడిపిస్తూనే టిమ్‌తో ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వెళ్తున్న లారీని గమనించకుండా వెనకనుంచి ఢీ కొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా డ్రైవర్‌తోపాటు బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లికి చెందిన ఫర్హానా, హసీనా, మున్నీ , ఆషాబీ, కరీంనగర్‌కు చెందిన సుకృతికిగా యా లు కాగా కొందరికి కుట్లు పడ్డాయి. అద్దె బస్సు డ్రైవర్‌కు టిమ్‌తో టికెట్లు ఇచ్చే శిక్షణ లేకున్నా అతడికి సదరు మిషన్ ఇచ్చి వరంగల్‌కు బస్సును పంపించిన అధికారుల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపించారు. సమ్మె విరమించే వరకు ప్రయాణికులెవరూ బస్సుల్లో ప్రయాణించవద్దని ఆ సంస్థ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

