హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 163వ జాతీయ రహదారి పరిధిలో ఉన్న యాదగిరి-వరంగల్ సెక్షన్లో మొత్తం 99.1 కి.మీ. హైవేను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ర హదారిని అప్పగించేలా ప్రణాళికలు రూపొందించింది. యాదగిరి-వరంగల్ సెక్షన్లో మొ త్తం 99.1 కి.మీ మేర రహదారిని రెండు ప్యా కేజీలుగా విభజించారు. ఈ హైవేపై కోమళ్ల, కొమటపల్లి టోల్ ప్లాజాల పరిధిలోని జాతీ య రహదారులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు అప్పగించనున్నారు.
తద్వారా ఈ హైవే నిర్వహ టణ బాధ్యతతోపాటు టోల్ వసూళ్ల అధికారం పూర్తిస్థాయిలో ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్లనున్నది. దీనితోపాటు దేశంలోని మరో 16 జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థల కు అప్పగించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించిం ది. ఈ రహదారుల ఆస్తులను టోల్-ఆపరేట్ -ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) పద్ధతుల ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, నిధులు సమీకరించనున్నారు. హైవేలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించినప్పటికీ యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వానికే ఉండనున్నాయి.