యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని 2014 అక్టోబర్ 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.2015లో దసరా రోజున సీఎం చేతులపై పునర్నిర్మాణానికి అంకురార్పణ.2015లో బాలాలయంలోని స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.ఈ క్రతువు కోసం రూ.950 కోట్లు ఖర్చు చేశారు.ఆలయ నిర్మాణంలో సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్‌స్వామి, తొగుట పీఠాధిపతి మాధవాచార్యులు, ప్రధాన స్తపతి సుందరరాజన్, ఆర్ట్ డైరెక్టర్ అనంద్సాయి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ప్రధానార్చకుడు నల్లంథిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ ఈవో ఎన్ గీత, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్రావు, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆమెరికా, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానంతో బెంగుళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీతో తయారుచేసిన పసిడి కాంతుల విద్యుద్దీపాల ఏర్పాటు.మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఎల్ఎన్ 6 గ్రేడ్ అల్యూమినియంతో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు వర్ణపు క్యూలైన్లు అమర్చారు.లడ్డూ, పులిహోర, వడ వంటి స్వామివారి ప్రసాదాలు తయారుచేసే యంత్రాలను చెన్నై, పుణె, హర్యానా, ముంబయి, రాజమండ్రి నుంచి తెప్పించారు.ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని గురుజపల్లిలో నాణ్యమైన 2.5 లక్షల టన్నుల కృష్ణశిలను యాదాద్రి నిర్మాణంలో వినియోగించారు.