పరీక్షలపై సానుకూలంగా పరిశీలించాలి
శంకర్పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కేసులో సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించే అంశాన్ని యూనివర్సిటీ సానుకూలంగా పరిశీలించాలని హైకోర్టు సూచించింది.
- ఇక్ఫాయ్ వర్సిటీకి హైకోర్టు సూచన
హైదరాబాద్ ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): శంకర్పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కేసులో సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించే అంశాన్ని యూనివర్సిటీ సానుకూలంగా పరిశీలించాలని హైకోర్టు సూచించింది. శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదని, ఈ లోగా తమను సస్పెండ్ చేయడం అన్యాయమని పేరొంటూ సస్పెన్షన్ గురైన విద్యార్థులు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
కమిటీ విచారణను సత్వరమే పూర్తి చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే, శుక్రవారం నుంచి ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయని, తమను అనుమతించేలా వర్సిటీకి ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో దాడి చేసినప్పుడు అకడ ఉన్నామేగానీ ఆ ఘటనలో పాల్గొనలేదని పిటిషనర్లు వాదించారు. ఈ మేరకు విద్యార్థుల భవిష్యత్తును పరిగణనలో తీసుకొని ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కు అనుమతించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

