Group-1 | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వివాదాలమయంగా మారిన గ్రూప్-1పై హైకోర్టు బుధవారం విచారించనున్నది. మొత్తం నాలుగు కేసులు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి. జీవో-29, పీహెచ్, ట్రాన్స్‌జెండర్ రి జర్వేషన్, లోకల్, నాన్ లోకల్ అంశాలపై అభ్యర్థులు వేసిన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించనుంది. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. బుధవారం హై కోర్టులో విచారణ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొన్ని అంశాలపై వాదనలు ముగియగా, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని పిటిషనర్ రాంబా బు అభిప్రాయపడ్డారు.
టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గ డువు బుధవారంతో ముగియనుం ది. దరఖాస్తు చేసుకోనివారు బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవ చ్చు. ఇప్పటి వరకు టెట్‌కు 2.07లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. అయితే టెట్ దరఖాస్తుల గడువును రెండు, మూడు రోజులు పొడిగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి కోరారు.