హైదరాబాద్ , ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన కేసులో కఠిన చర్యలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు సోమవారం నిరాకరించింది.
వ్యాపారవేత్తపై దాడి చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సుమంత్ దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. ఈ కేసులో మంగళవారం కూడా విచారణ జరుగనున్నది.