హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతులకు తిరిగి పో స్టుమార్టం నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టంచేసింది. ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ, బంధువుల సమక్షంలో రెండోసారి ఇంక్వె స్ట్ చేసేందుకు కూడా అనుమతించలేమని తేల్చి చెప్పింది. కాగా, ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించామని, హైకోర్టు ఆదేశించిన కారణంగా మల్లయ్య మృతదేహాం మాత్రమే భద్రపర్చామని ప్రభుత్వం తెలిపింది. మల్లయ్య మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఎన్కౌంటర్ బూటకమంటూ మృతు డు మల్లయ్య భార్య కే ఐలమ్మ అలియాస్ మీనా వేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు. ఈ ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్ సు మోటోగా విచారణ చేస్తున్నదని, పిటిషనర్ ఆ కమిషన్ వద్దకు వెళ్లవచ్చునని సూచించింది. కేసును ఈ నెల 26కు వాయిదా వేసింది.
టీసీ ఇచ్చారని విద్యార్థి ఆత్మహత్యాయత్నం?
అచ్చంపేట రూరల్, డిసెంబర్ 5 : అకారణంగా టీసీ ఇచ్చారని గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. వి ద్యార్థి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం బోల్గాట్పల్లికి చెంది న విద్యార్థి అచ్చంపేట ఎస్సీ గురుకుల పా ఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కృష్ణమ్మ, ఈశ్వరయ్య హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేస్తున్నారు. సదరు విద్యార్థి రాజధానిలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తుంటాడు. ఈ విద్యార్థి పేరుతోనే ఉన్న మరో విద్యార్థి హై దరాబాద్ గురుకులంలో 8వ తరగతి చ దువుతున్నాడు. అతడు పలు చోరీ ఘటన ల్లో పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో పోలీసులు పాఠశాలలో సదరు పేరుపై ఎవరైనా ఉన్నారా అని ఇటీవల ఆరా తీశారు. తరచూ హైదరాబాద్‌కు వెళ్లి వస్తుండడంతో అతడిపై క్లాస్ టీచర్ అనుమానం వ్యక్తం చేసి, టీసీ ఇచ్చి పంపించారు. తనను దొంగ అని క్రి యేట్ చేశారని మనస్తాపంతో గురువారం గ్రామంలో గుళికల మందు తాగేందుకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గురుకుల ప్రిన్సిపాల్ అంజయ్యను వివరణ కోరగా.. విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. విద్యార్థి పలుమార్లు తరగతులు ఎగ్గొట్టి ఇంటి వద్ద ఉండేవాడని తెలిపారు.