భద్రాచలం గోదావరిలో రక్షణపై నివేదించండి
భద్రాచలం గోదావరి తీరంలోని ఇసుక తిన్నెల వద్ద రక్షణ ఏర్పాట్లపై నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): భద్రాచలం గోదావరి తీరంలోని ఇసుక తిన్నెల వద్ద రక్షణ ఏర్పాట్లపై నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గోదావరి తీరంలో ఫొటోలు తీసుకుంటూ నదిలో గల్లంతై మృతి చెందారు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక హైకోర్టుకు లేఖ రాశారు.
పర్యాటక ప్రాంతం, పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఇసుక తిన్నెల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఈ లేఖను పరిశీలించిన పిల్ కమిటీ ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్నది. ఈ పిటిషన్‌పై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజె వాదనలు వినిపిస్తూ.. ఈ ఘటన తరువాత ఇటువైపు రక్షణ చర్యలు చేపట్టినట్టు వివరించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

