రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’
దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను సమావేశానంతర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి మంత్రి వెల్లడించారు.
- 9న కొడంగల్‌లో భారీ రైతు సభ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను సమావేశానంతర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి మంత్రి వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. 9న కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి భారీ రైతు బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించిందని, అదే రోజున ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సిద్దిపేటలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

