హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎమ్మార్వో కుల ధ్రువీకరణ పత్రం జారీ చేశాక దానిపై తనిఖీ పూర్తికాలేదన్న కారణంతో నిజామాబాద్ జిల్లా ముషల్ మండలం నల్లూరు గ్రామానికి చెందిన ఎస్టీ అభ్యర్థి డీ కార్తీక్ కుమార్ను యూపీఎస్సీ కోచింగ్ తరగతులకు అనుమతించకపోవడంపై హైకోర్టు స్పందించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన కార్తీక్ కుమార్ను తరగతులకు అనుమతిచాలని ఇండియన్ అడి ్మనిస్ట్రేటివ్ సర్వీస్ స్టడీ సరిల్ను ఆదేశిస్తూ జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్టీ సంక్షేమశాఖను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.