హైదరాబాద్, నమస్తే తెలంగాణ : సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్ రెడ్డికి హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మే 3న జస్టిస్ రాజశేఖర్రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ అధ్యక్షతన వీడోలు సమావేశం నిర్వహించారు. సౌమ్యుడిగా, సమర్ధ న్యాయమూర్తిగా, వివాద రహితుడిగా జస్టిస్ రాజశేఖర్రెడ్డి పేరుపొందారని జస్టిస్ సతీశ్ చంద్రశర్మ కొనియాడారు. తన పదవీకాలంలో సహకరించిన వారికి జస్టిస్ రాజశేఖర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జే రామచందర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ రాజేశ్వరరావు సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.