హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సెర్చ్ వారెంట్లు జారీచేసే అధికారం పోలీసులకు ఎకడ ఉన్నదో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెర్చ్ వారెంట్లకు సంబంధించి సీఆర్పీసీలోని సెక్షన్ 93, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 47ను దుర్వినియోగం చేస్తున్నారంటూ న్యాయ విద్యార్థి విజయగోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. పిటిషనర్ వాదిస్తూ.. ఉగ్రవాదులు, సంఘవ్యతిరేక శక్తుల కోసం గాలిస్తున్నామంటూ పోలీసులు అర్ధరాత్రి ఇండ్లలోకి వస్తున్నారని, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను చూపాలంటూ వేధిస్తున్నారని వివరించారు.
ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అధికారాలను పోలీసులు హస్తగతం చేసుకున్నారని, లేని అధికారాలతో సెర్చ్ వారెంట్లు జారీచేస్తున్నారని తెలిపారు. దీంతో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్ల జారీకి సంబంధించిన అధికారాలపై హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలు అ సంపూర్ణంగా ఉన్నాయని తప్పుపట్టింది. సీఆర్పీసీ, బీఎన్ఎస్ఎస్ నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా పోలీసులకు, ఇతర అధీకృత అధికారులకు అధికారాలు క ల్పిస్తూ జారీచేసిన నోటిఫికేషన్ వివరాలను అఫిడవిట్లో ఎందుకు పేరొనలేదని ప్రశ్నించింది. ఆ నోటిఫికేషన్‌తోపాటు ఇతర అనుబంధ పత్రాలతో సమగ్ర వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.