హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సీనియర్ న్యాయవాది కే ప్రతాప్‌రెడ్డి (94)కి హైకోర్టు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించింది. ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ అధ్యక్షతన హైకోర్టు న్యాయమూర్తు లు, న్యాయవాదులు సమావేశమై ప్రతాప్‌రెడ్డి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతాప్‌రెడ్డి న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రతాప్‌రెడ్డి కార్యాలయం నుంచి న్యాయవాదులుగా వృత్తిని ప్రారంభించిన వారు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయికి ఎదిగారని చెప్పారు. ప్రతాప్‌రెడ్డి కుటుంబసభ్యులు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.