హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగా ణ): లైంగికదాడి కేసుల్లో 24 గంటల్లోగా బాధితు ల నుంచి వివరాలు సేకరించాలని కింది కోర్టులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణ సమయంలో అమలు చేయాల్సిన నిబంధన లపై బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహి ళా న్యాయమూర్తి మాత్రమే వివరాలు నమోదు చేయాలని, ఒకవేళ ఆ కోర్టులో మహిళా న్యాయమూర్తి లేకపోతే సమీప కోర్టు మహిళా న్యాయమూర్తిచే వివరాలు సేకరించాలని సూచించింది. 24గంటల్లోగా న్యాయమూర్తి ఎదు ట బాధితురాలిని ప్రవేశపెట్టకపోతే దర్యాప్తు అధికారి నుంచి కారణాలు నమోదు చేయాలని పేర్కొన్నది.