హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): జన్వాడ ఫాంహౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారంటూ నమోదైన కేసుతోపాటు ఎల్బీనగర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్ దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్ర భుత్వాన్ని ఆదేశించింది.
రేవంత్ పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. డ్రోన్ కేసులో నమోదు చేసిన ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలను సమర్పించాలని పీపీ పల్లె నాగేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌పై కూడా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసి, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.