హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోళ్ల విషయంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఈ నెల 22న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఎంబీఎస్ అధినేత సుఖేశ్ గుప్తాను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కే సురేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ సభ్యుల వ్యవహారంలో గతంలోని స్టే ఉత్తర్వులను కొనసాగిం చొచ్చని, అధినేత గుప్తాను ఈడీ ప్రశ్నించేందుకు అనుమతించా లని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్ కోరారు. గుప్తాకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీల ను ప్రశ్నించాల్సి ఉన్నదని తెలిపారు. ఈడీ నోటీసులను సవాల్ చేసిన కేసులో హైకోర్టు పైవిధంగా ఉత్తర్వులను సవరించింది. విచారణ పేరుతో కుటుంబాన్ని వేధించడానికి వీల్లేదని వ్యాఖ్యా నించింది. విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.