హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): నోటిఫికేషన్లోని రూల్స్ ప్రకారమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ నియామకం ఉండాలని అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
నోటిఫికేషన్ ఇచ్చాక నిబంధనలను మార్చడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు సాధించిన తనను కాకుండా అదనపు అర్హతలు చేర్చడం ద్వారా మరొకరిని అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించారంటూ లావణ్య దాఖలు చేసిన పిటిషన్పై గతంలో విచారణ జరిపిన జడ్జి ఆమె దరఖాస్తును పరిశీలించాలని ఉత్తర్వులు జారీచేశారు.