హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఎలాంటి కేసులు లేకపోయినా 75 ఏండ్ల రిటైర్డ్ ఎస్సైని ఇంటినుంచి బలవంతంగా లాకెళ్లి అనుచితంగా ప్రవర్తించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సాటి పోలీసుతో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించింది. మే 18న యూ సుఫ్‌గూడలోని ఇంటిలో ఉండగా పోలీసులు బలవంతంగా తనను తీసుకెళ్లి అవమానించారని,పరిహారం ఇప్పించాలంటూ రిటైర్డ్ ఎస్సై మహ్మద్ ఉస్మాన్ పిటిషన్ వేశారు.
దీనిని జస్టిస్ టీ మాధవీదేవి గురువారం విచారించారు. న్యాయవాది వాదనలు వినిపిస్తూ కనీసం దుస్తులు వేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా లోదుస్తులతోనే పిటిషనర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారని చెప్పారు. దీంతో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ మధురానగర్ పోలీసులకు కోర్టు నోటీసులు ఇచ్చింది.