హైదరాబాద్, ఆగస్టు 30 ( నమస్తే తెలంగాణ) : రెండో విడత దళిత బంధు పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ఈ ఏడాది జూన్ 24న జారీ చేసిన జీవో 8పై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి 1,100 కుటుంబాలను గుర్తించాలంటూ కలెక్టర్లకు ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలపై హైదరాబాద్‌కు చెందిన కే అఖిలశ్రీ గురుతేజ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు సీఎస్‌కు, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు నోటీసులిచ్చింది.