శ్రీశైలం/అచ్చంపేట, జూలై 12 : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తికి దేవస్థాన అధికారులు, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆయన కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలికి న్యాయమూర్తిని శాలువాతో సన్మానించి స్వామివారి, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.