హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఫస్ట్ కోర్టు హాలు లో తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అధ్యక్షతన న్యాయమూర్తులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చి ఆమె సేవలను కొనియాడారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ రాధారాణి 675 రోజుల్లో 5,375 మెయిన్ కేసులు, 6,818 మిస్లీనియస్ కేసులు పరిషారించారని చెప్పారు. చట్టం అనేది న్యాయసూత్రం కాదని, అది సమాజానికి ఆత్మలాంటిందిగా భావిస్తానని జస్టిస్ రాధారాణి తెలిపారు.
అనంతరం ఆమెకు ఘనంగా వీడోలు పలికారు. కా ర్యక్రమంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ నర్సింహ శర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్, ఏఏజీలు ఇమ్రాన్ ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) అధ్యక్షుడు జగన్, పలువురు న్యాయమూర్తులు, జస్టిస్ రాధారాణి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం హెచ్‌సీఏఏ ఆధ్వర్యంలో వీడోలు సమావేశం జరిగింది. ఏపీలోని తెనాలికి చెందిన రాధారాణి.. న్యాయవాదిగా కొంతకాలం ప్రాక్టీస్ చేశా క డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీతోపాటు తెలంగాణలో పనిచేశారు. నల్లగొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, హైదరాబాద్‌లోని ‘వ్యాట్’ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా, రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా సేవలందించారు.