తొర్రూరు, మే 21 : కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఈ స్థలంలో శంకుస్థాపన చేయడంతో భూమి వ్యవహా రం వెలుగుచూసింది. ఈ స్థలాన్ని విదేశీయురాలైన ఝాన్సీరెడ్డి ఎలా కొనుగో లు చేసిందని వర్ధన్నపేట, ఇల్లంద ప్రాంతానికి చెంది న దామోదర్‌రెడ్డి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశా రు. గతంలో భారత పౌ రసత్వాన్ని వదిలి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఝాన్సీరెడ్డి, విదేశీ మారక వ్యవహారాల చట్టం ప్రకారం వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం నేరం.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపి భూమిని కొనుగోలు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించా రు. ఈ పిటిషన్‌పై మే 1న హైకోర్టులో జడ్జి సీవీ భాసర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై జూన్ 19లోపు వివరణ ఇవ్వాలని రెవెన్యూ అధికారులతోపాటు ఝాన్సీరెడ్డి, రాజేందర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెమా చట్టం ప్రకారం విదేశీ పౌరులు వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం నేరమని, గతంలో ఇలాంటి ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ కేసుతో కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి లీగల్‌గా చికుల్లో పడ్డారు. న్యాయపరంగా ఈ వ్యవహారం ఏ దిశగా మలుపు తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది.