హైదరాబాద్, డిసెంబర్ 13, (నమస్తే తెలంగాణ) : సినీ నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట దక్కింది. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట ఘటనపై అరెస్టయిన అల్లు అర్జున్‌కు శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరుచేసింది. రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. తొకిసలాటలో మరణించిన మహిళ భర్త ఫిర్యాదు మేరకు చికడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిసన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యజమానులు ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఇంకా అరెస్ట్ కాని ఇతర నిందితుల్లో నలుగురు సంధ్య థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులకు ఉత్తర్వులను జారీచేశారు.
అల్లు అర్జున్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతించాలని కోర్టును కోరారు. సామాన్యులకు ఒకలా, అల్లు అర్జున్‌కు మరోలా చేయవద్దని పోలీసుల తరఫున అదనపు పీపీ జితేందర్‌రావు వీలమల్లకు ప్రతివాదన చేశారు. అల్లు అర్జున్ పిటిషన్‌ను సామాన్యుడిగానే పరిగణించాలని నిరంజన్‌రెడ్డి కోరారు. సెలబ్రిటీ అని అల్లు అర్జున్ హకులకు భంగం కలిగించొద్దని గతంలో పుషరాలకు ఏపీ సీఎం హాజరైతే సుమారు 30 మంది చనిపోయారని, అప్పుడు కూడా ఇదే తరహా కేసు నమోదు చేశారా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు, ఇదే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చాయని గుర్తుచేశారు. లంచ్‌మోషన్ పిటిషన్‌పై రిజిస్ట్రీ అభ్యంతరంతో విచారణ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. సంధ్య థియేటర్ భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్ తరఫున న్యాయవాది కరంచెంప కొమిరెడ్డి వాదించారు. పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శనపై పోలీసులకు సమాచారం ఇచ్చామని, అన్యాయంగా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారని.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాజకీయ సభలు, ర్యాలీల్లో మరణించిన ఘటనల్లో ఇలాంటి ఘటనలపై నమోదు చేయని కేసులను ఇప్పుడెలా చేశారని తప్పుబట్టారు.
ఒకరోజు పిటిషనర్ జైల్లో ఉన్నా హకులకు భంగం కలిగించినట్టేనని అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఏ ఆధారాలు లేకుండా నిర్బంధించడం చట్ట వ్యతిరేకమని,వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టేనని చెప్పారు. హత్య జరుగుతుందని తెలిసి ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారం టూ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
షారూఖ్‌ఖాన్ ఒకసారి రైలులో ప్రయాణిస్తుండగా రైల్వేస్టేషన్లో తొకిసలాట జరిగిందంటూ పోలీసులు పెట్టిన కేసును కోర్టు కొట్టేసిందని అల్లు అర్జున్ తరఫు లాయర్ గుర్తుచేశారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. పిటిషనర్‌ను రిమాండ్‌కు పంపినా క్వాష్ పిటిషన్లో కోర్టులు మధ్యంతర బెయిల్ మంజూరు చేయవచ్చునని కోరారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు, బండి సంజయ్ అరెస్టు కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే నిదర్శమని చెప్పారు. ఈ రెండు కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టుగానే అల్లు అర్జున్‌కు కూడా ఇవ్వాలని కోరారు.
సంధ్య థియేటర్‌కు వస్తే తొకిసలాట జరిగే అవకాశం ఉన్నదని ఎస్‌హెచ్‌వో చెప్పినా అల్లు అర్జున్ ఖాతరు చేయలేదని పీపీ పల్లె నాగేశ్వరరావు తెలిపారు. నటుడు అయితే ప్రత్యేక హకులు ఉండవని చెప్పారు. థియేటర్ యాజమాన్యం, నటుడు పోలీసులకు సమాచారం ఇచ్చినంత మాత్రాన అనుమతి ఇచ్చినట్టు కాబోదని స్పష్టం చేశారు. పోలీసుల నుంచి అనుమతి మంజూరుకానందున తొకిసలాటకు వాళ్లే కారణమని చెప్పారు. ఇప్పటికే నిందితుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని గుర్తు చేశారు. రిమాండ్ రిపోర్టు లేకుండా దానిపై ఉత్తర్వులు జారీ చేయడానికి వీలు లేదని చెప్పారు. పిటిషనర్ న్యాయవాది చెప్తున్న తీర్పులు ఈ కేసులో వర్తించబోమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు.
భోజన విరామం తర్వాత పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదించారు. నిందితుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారని, నాంపల్లి కోర్టు రిమాండ్ ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పారు. కాబట్టి పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. నిరంజన్‌రెడ్డి కల్పించుకుని, సెలబ్రిటీ అని హకులను హరిస్తుంటే కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరారు. లంచ్ మోషన్ అనుమతించాలో లేదో కోర్టులే తేల్చాలని కోరారు. జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, భజనలాల్ కేసుల్లో అరెస్టు తర్వాత కూడా కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
వాదప్రతివాదనల అనంతరం హైకోర్టు సూటిగా ఆధారాలను చూపాలని ఆదేశించింది. సంధ్య థియేటర్‌కు వస్తున్నట్టు పిటిషనర్ అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా ఆ ధారాలు చూపుతున్నారని, అల్లు అర్జున్ను అక్కడికి రావద్దని పోలీసులు చెప్పినట్టుగా ఆధారాలు చూపడంలేదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తొకిసలాటలో ఊరిరాడక మహిళ మరణిస్తే అందుకు సినిమాకు వచ్చిన అల్లు అర్జున్ బాధ్యుడు ఎలా అవుతారని ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిలు మంజూరు చేయొచ్చని పిటిషనర్ లాయర్ ఉదహరిస్తున్న తీర్పులను పరిశీలించాలని పీపీకి చెప్పింది. మొత్తంగా ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే పిటిషనర్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కేసును నిరూపించ డం లేదని అభిప్రాయపడింది. నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్టున్నట్టు వెల్లడించింది. రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని పేర్కొన్నది. మధ్యంతర బెయిల్ పొందేందుకు జైలు సూపరింటెండెంట్‌కు రూ.50 వేల విలువైన వ్యక్తిగత పూచీకత్తును స మర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.