గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:13:09

కూల్చివేతకు అనుమతి అవసరం లేదు

కూల్చివేతకు అనుమతి అవసరం లేదు

  • హైకోర్టుకు పీసీబీ, ఎస్‌ఈఐఏఏ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ), స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) హైకోర్టుకు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన ‘నిర్మాణం- కూల్చివేత నిబంధనలు- 2016’ను పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పాత సచివాలయ భవనాలు కూల్చుతున్నారని దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బుధవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. పీసీబీ, ఎస్‌ఈఐఏఏ వివరణను ధర్మాసనానికి సమర్పించారు. శుక్రవారంనాటికి విచారణ వాయి దావేస్తూ మధ్యంతర ఉత్తర్వులను అప్పటివరకు హైకోర్టు పొడిగించింది. 


logo