హైదరాబాద్, నవంబర్ 24 (నమ స్తే తెలంగాణ): గృహహింస కేసులో నిందితులుగా ఉన్న దంపతులకు వ్య తిరేకంగా పోలీసులు లుకౌట్ సర్యులర్(ఎల్వోసీ) జారీ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సా మాజిక మాధ్యమాల ద్వారా 41ఏ నోటీసులు పంపడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అయినప్పటికీ ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేద న్న సాకుతో ఆ దంపతులకు వ్యతిరేకంగా ఎల్వోసీ జారీ చేయడం, అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ ప్రాథమిక హక్కులను హ రించడమే అవుతుందని, విదేశీ పౌరసత్వం ఉన్న ఆ దంపతుల విషయం లో నిబంధనలు అమలు చేయకపోతే అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ వ్యాఖ్యానించారు. గృ హహింస కేసులో అరెస్టులకు ముందు ప్రాథమిక దర్యాప్తు జరిపి, వాస్తవాలను నిర్ధారించుకోవాలని పోలీసులకు చివాట్లు పెట్టింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లపై ఆరోపణలకు సరైన ఆధారాలేమీ కనిపించడం లేదని పేర్కొంటూ.. ఆ దంపతులు సింగపూర్ వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా చూడాలని ఏపీపీ గణేశ్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఏఏఐ భూమి స్వాధీనం చెల్లదు ; కేంద్రానికి సమాచారం ఇవ్వాల్సిందే: హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి సర్వే నంబర్ 28లోని 9 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ 2008 ఫిబ్రవరి 28న తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారి టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధీనంలో ఉన్న ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటే తప్పనిసరిగా కేంద్రానికి సమాచారం ఇవ్వాలని తేల్చిచెప్పింది. పం చనామా నిర్వహించినప్పుడు, ఆ భూ మిని స్వాధీనం చేసుకునే ముందు ఏఏఐకి ఎలాంటి నోటీసులు ఇవ్వనందున స్వాధీన ఉత్తర్వులు చెల్లవని జస్టిస్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.