హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ పనులపై నివేదిక సమర్పించాలని, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ను మా వరకు చేపట్టిన పనుల పరిస్థితిని తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండో దశ పనుల వల్ల ఆ మా ర్గానికి 7 కి.మీ. దూరంలోని వారస త్వ కట్టడాలపై పడే ప్రభావంపై అధ్యయన నివేదిక ఇవ్వాలని హెచ్ఎంఆర్ఎల్కు స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలోని వారసత్వ కట్టడాల పరిరక్షణకు కమిటీ ఏర్పాటైందో లేదో చెప్పాలని, ఒకవేళ ఆ కమిటీని ఏర్పాటుచేసి ఉంటే అది ఏం చేసిందో కూడా నివేదించాలని పేర్కొన్నది.
రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ మధ్య వారసత్వ కట్టడాలపై ప్రతికూల ప్రభావం పడేలా నాలుగో కారిడార్ నిర్మాణ పనులు చేపట్టడాన్ని స వాల్ చేస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్(ఏపీడబ్ల్యూఎఫ్) అధ్యక్షు డు మహమ్మద్ రహీంఖాన్, ఇతరు లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టి స్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. తొలు త మెట్రోరైల్ రెండో దశ అలైన్మెంట్ కు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వీక్షించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది రామారావు వాదనలు వినిపిస్తూ.. వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ నుంచి అనుమతులు తీసుకోకుండానే అధికారులు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించారని తెలిపారు. మరో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అలియాబాద్ సారాయ్ ప్రైవేట్ ఆస్తి కాదని, అ ది వక్ఫ్ బోర్డుదని చెప్పారు. హెచ్ఎంఆర్ఎల్ తరఫున అదనపు అడ్వకేట్ జ నరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ ప్రతివాదన చేస్తూ..
అజాఖానా జోహ్రా ఎ దురుగా ఉన్న జీహెచ్ఎంసీ పాత భ వనం, రాజారాయ్ దేవిడీ(శ్యామ్ రాజ్ భవనం) వద్ద ఉన్న క్లాక్ టవర్, దెబ్బతిన్న అలియాబాద్ సారాయ్తో కలిపి మొత్తం 3 పాత నిర్మాణాలు ఉ న్నాయని, వాటి మధ్య 5 మీటర్ల దూ రాన్ని పాటిస్తామని వివరించారు. మెట్రో మార్గంలో ఆలయాలు, మసీదులు, చిల్లాలు, దర్గాలు, సమాధులు సహా మొత్తం 102 నిర్మాణాలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ఎకడా రైల్వేట్రాక్‌లు లేవని చెప్పారు. దీంతో హెచ్ఎంఆర్ఎల్కు పైవిధంగా ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.