తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్‌కుమార్, పీ.శ్రీసుధ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం పురస్కరించుకుని ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా ఈ నెల 11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించేది లేదని అధికారులు ప్రకటించారు.